Jailer | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి జైలర్ (Jailer). యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునీల్, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చాలా రోజుల ఎదురుచూపు తర్వాత తలైవా టీం క్రేజీ అప్డేట్ అందించింది. ‘ఎదురుచూడటం అయిపోయింది.. సాయంత్రం 6 గంటలకు జైలర్ అప్డేట్..’ అంటూ సన్ పిక్చర్స్ బ్యానర్ ట్వీట్ చేసింది.నెట్టింట హల్ చల్ చేస్తున్న టాక్ ప్రకారం జైలర్ నుంచి రాబోయేది రిలీజ్ డేట్ అప్డేట్ అయి ఉంటుందని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే జైలర్ నుంచి విడుదలైన మోహన్ లాల్, సునీల్, తమన్నా (Tamannaah) స్టిల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.తలైవా 169వ ప్రాజెక్ట్‌గా వస్తోంది జైలర్.ఇదిలా ఉంటే రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా ప్రకటించాడు. పాపులర్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
నో వెయిటింగ్..
The wait is over…#Jailer update today at 6pm! 🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial
— Sun Pictures (@sunpictures) May 4, 2023
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023