South Indian Origin Actresses | ప్రస్తుతం అంతర్జాతీయ సినిమా రంగం (హాలీవుడ్)లో భారతీయ మూలాలున్న నటీమణుల ప్రభావం మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం చిన్న పాత్రలకే పరిమితమైన మన దక్షిణాది ములాలున్న నటులు, నేడు ప్రధాన పాత్రల్లో నటిస్తూ గ్లోబల్ స్టార్స్‌గా ఎదుగుతున్నారు. ముఖ్యంగా తమిళ మూలాలున్న వారు అక్కడ ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి ఒక తెలుగు అమ్మాయి కూడా చేరింది.
తమిళ మూలాలతో దుమ్మురేపుతున్న నటీమణులు
హాలీవుడ్లో ప్రస్తుతం తమిళ మూలాలున్న భామల హవా స్పష్టంగా కనిపిస్తోంది. భాష ఏదైనా వారి వేర్లు మన దక్షిణాదివే కావడం విశేషం:
మైత్రీయి రామకృష్ణన్: నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘Never Have I Ever’ తో ఈమె రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్ అయిపోయింది. శ్రీలంక తమిళ మూలాలున్న మైత్రీయి, ఇప్పుడు హాలీవుడ్లో అత్యధిక డిమాండ్ ఉన్న యువ నటీమణుల్లో ఒకరు.

Maitreyi Ramakrishnan
సైమన్ యాష్లే : హాలీవుడ్లో తమిళ మూలాలున్న మరో భామ సైమన్ యాష్లే (Simone Ashley) సెన్సేషన్. ‘బ్రిడ్జర్టన్’, ‘సెక్స్ ఎడ్యుకేషన్’వంటి వెబ్ సిరీస్‌లతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది ఈ భామ.

Simon Ashley
చరిత్రా చంద్రన్: నెట్‌ఫ్లిక్స్ హిట్ పీరియడ్ డ్రామా ‘Bridgerton’ (Season 2) లో ఎడ్వినా శర్మగా నటించి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఆక్స్ఫర్డ్ గ్రాడ్యుయేట్ కావడం మరో విశేషం.

Charitra Chandran
అంజనా వాసన్: ‘బ్లాక్ మిర్రర్’ వంటి కల్ట్ సిరీస్‌లలో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె స్టేజ్ నాటకాల్లోనూ ఆరితేరిన నటి.

Anjana Vaasan
గెరాల్డిన్ విశ్వనాథన్: ‘Blockers’, ‘The Broken Hearts Gallery’ వంటి సినిమాలతో కామెడీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తండ్రి మలయాళీ-తమిళ మూలాలున్న వ్యక్తి.

Geraladine Viswanathan
పూర్ణ జగన్నాథన్: ‘నెవర్ హావ్ ఐ ఎవర్’లో తల్లి పాత్రలో మెప్పించిన ఈమె, హాలీవుడ్లో ఎప్పటి నుంచో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

Poorna Jagannathan
అవంతిక వందనపు
ఇక తెలుగు నుంచి ఒక్కరైనా లేరా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు సమాధానంగా నిలిచింది అవంతిక వందనపు. ఈమె కేవలం హాలీవుడ్లో అడుగుపెట్టడమే కాకుండా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. అవంతిక కుటుంబం హైదరాబాద్‌కు చెందింది. చిన్నప్పుడే అమెరికాలో స్థిరపడినప్పటికీ, తన నటనా ప్రయాణాన్ని టాలీవుడ్లోనే మొదలుపెట్టింది. ‘బ్రహ్మోత్సవం’లో మహేష్ బాబు మేనకోడలిగా, ‘ప్రేమమ్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది.

Avanthika Vandanapu
డిస్నీ ఒరిజినల్ మూవీ ‘Spin’ లో ప్రధాన పాత్ర పోషించి హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది అవంతిక వందనపు. ఇక 2024లో విడుదలైన మ్యూజికల్ కామెడీ ‘Mean Girls’ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ‘కరేన్ శెట్టి’గా ఆమె చేసిన కామెడీ టైమింగ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇటీవల విడుదలైన హారర్ థ్రిల్లర్ ‘Tarot’ లోనూ కీలక పాత్రలో మెరిసింది. గతంలో హాలీవుడ్ అంటే కేవలం విదేశీయులే ఉండేవారు. కానీ ఇప్పుడు కథల్లో వైవిధ్యం పెరగడం, భారతీయ పాత్రలకు ప్రాధాన్యత లభించడంతో మన వారు రాణిస్తున్నారు. తెలుగు నుంచి అవంతిక ఒక మార్గాన్ని సుగమం చేయగా, రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు ప్రతిభలు గ్లోబల్ స్క్రీన్‌పై మెరవడం ఖాయంగా కనిపిస్తోంది.