Unstoppable | ‘అన్‌స్టాపబుల్’ ఆద్యంతం నవ్విస్తుంది
సప్తగిరి, వీజే సన్నీ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘అన్‌స్టాపబుల్'. నక్షత్ర, అక్సాఖాన్ నాయికలు. రజిత్ రావు నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతున్నది.
సప్తగిరి, వీజే సన్నీ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘అన్‌స్టాపబుల్’. నక్షత్ర, అక్సాఖాన్ నాయికలు. రజిత్ రావు నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో హీరో వీజే సన్నీ మాట్లాడుతూ…‘నేను నాటకరంగం నుంచి టీవీకి అక్కడి నుంచి సినీ పరిశ్రమకు వచ్చాను. ‘బిగ్ బాస్’ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత హీరోగా కొత్త నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు వచ్చాయి. అలా ఈ కథ విన్నాను. కథ విన్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. సప్తగిరి ప్రతి సన్నివేశంలో ఇన్వాల్వ్ అయి చేస్తుంటారు. ఇద్దరం పోటీ పడి నటించాం. నేనూ, సప్తగిరి చిచ్చా, మచ్చా అనే పాత్రల్లో కనిపిస్తాం.
సినిమా ఆద్యంతం మా ఇద్దరి పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది. కథలో మాకు ఎదురైన పరిస్థితులు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడ్డాం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. డబ్బు మా జీవితాలతో ఎలా ఆడుకుంది అనేది వినోదాన్ని పంచుతుంది. సినిమా చివరి వరకు ఫన్ రైడ్‌లా ఉంటుంది. ప్రతి పాత్ర నవ్విస్తుంది. ‘ఏటీఎం’ వెబ్ సిరీస్‌లో నా నటన చూసి దర్శకుడు హరీశ్ శంకర్ మెచ్చుకున్నారు. ఆయన ప్రశంస నటుడిగా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ తరహా పాత్రలైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. హీరోగా నటించడంతో పాటు పెద్ద హీరోల చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించాలని ఉంది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నా’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

