Khalnayak Returns | 33 ఏళ్ల తర్వాత సంజయ్ దత్ మాస్ అవతార్.. అదిరిపోయిన ‘ఖల్ నాయక్’ రిటర్న్స్ ఫస్ట్ లుక్
Sanjay Dutt | బాలీవుడ్ యాక్షన్ నటుడు సంజయ్ దత్ అభిమానులకు ఒక భారీ అప్డేట్ వచ్చింది.
Sanjay Dutt | బాలీవుడ్ యాక్షన్ నటుడు సంజయ్ దత్ అభిమానులకు ఒక భారీ అప్డేట్ వచ్చింది. 1993లో సంచలనం సృష్టించిన సంజయ్ దత్ ఐకానిక్ హిట్ సినిమా ‘ఖల్ నాయక్’ (Khalnayak)కు సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ (Khalnayak Returns) ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. 1993 నాటి బాల్ రామ్ ప్రసాద్ అలియాస్ ‘బల్లు’ పాత్రలో సంజయ్ దత్ మళ్ళీ కనిపించబోతున్నాడు. టీజర్లో ఆయన అత్యంత మొరటుగా, నోటిలో సిగరెట్‌తో పవర్ఫుల్ అవతారంలో కనిపించారు.
సంజయ్ దత్ సొంత బ్యానర్ త్రీ డైమెన్షన్ మోషన్ పిక్చర్స్, అక్ష కాంబోజ్ కు చెందిన ఆస్పెక్ట్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జియో స్టూడియోస్ జ్యోతి దేశ్‌పాండే సమర్పిస్తుంది. మరోవైపు ఈ సినిమా సీక్వెల్ గురించి సంజయ్ దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1993 బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే 4,000 మంది తోటి ఖైదీల సలహా మేరకు ఈ కథను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చిందని ఆయన వెల్లడించారు. ఖల్ నాయక్ నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. సుభాష్ ఘై గారు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఆయన ఈ చిత్రంలో కూడా భాగస్వామిగా ఉంటారు. అంటూ సంజయ్ దత్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

