టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ది ఘోస్ట్ (The Ghost). ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ది ఘోస్ట్ ఉపయోగించిన ఆయుధం (కత్తి) లుక్‌ను విడుదల చేశారు.
అరుదైన స్టీల్ తమహగనేతో తయారు చేసిన కత్తి (జపనీస్ కటన)ని ఈ సినిమాలో వినియోగించారు మేకర్స్. రాడ్లు, ఇనుము కూడా కట్ చేసే సత్తా ఈ కత్తికుండటం ఈ జపనీస్ ఆయుధం ప్రత్యేకత. క్రిమినల్స్ పై ఈ ఆయుధాన్ని వాడుతాడు ఘోస్ట్. ఆగస్టు 18 ఉదయం 10:08 గంటలకు భారీ అప్ డేట్ ఉండబోతుందని తాజా పోస్టర్‌తో తెలియజేశారు. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా కనిపించబోతున్నాడు. మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Tamahagane – The Origin of The Ghost’s Sword 🗡
Stay tuned to August 18th, 10:08 AM.#TheGhost@iamnagarjuna @PraveenSattaru @SVCLLP @nseplofficial @sonalchauhan7 @bharattsaurabh @SonyMusicSouth @AsianSuniel @puskurrammohan @sharrath_marar @Dharmi_edits @mukesh_DOP pic.twitter.com/HT98IKLLax
— Praveen Sattaru (@PraveenSattaru) August 9, 2022