Priyanka Upendra : నటి, కన్నడ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక నటించిన 50వ సినిమా ‘డిటెక్టివ్ తీక్షణ’. ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహిస్తున్నారు. గుత్తముని ప్రసన్న, జి మునివెంకట్ చరణ్, పురుషోత్తం బి నిర్మాతలు.
ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నటి ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ…‘తీక్షణ తెలివైన, ధైర్య సాహసాలు గల మహిళ. ఇదొక ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు వినోదంతో పాటు ఒక థ్రిల్‌కు గురవుతారు. మహిళల్లో స్ఫూర్తినింపే చిత్రమవుతుందని ఆశిస్తున్నాను. త్వరలో కన్నడతో పాటు తెలుగు, తమిళం, బెంగాళీ, హిందీలో విడుదల చేయబోతున్నాం’ అని చెప్పింది.