వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్, బిత్తిరి సత్తి, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అన్‌స్టాపబుల్’. ‘అన్లిమిటెడ్ ఫన్’ ఉపశీర్షిక. డైమండ్ రత్నబాబు దర్శకుడు. రజిత్ రావు నిర్మాత. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ‘బుల్ బుల్ అన్‌స్టాపబుల్’ అనే తొలి పాటను ఇటీవల హీరో గోపీచంద్ విడుదల చేశారు. రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి భీమ్స్ ఈ పాటను ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్నందించారు. ఆద్యంతం వినోదప్రధానంగా నవ్వుల్ని పంచే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు.