తలకోన అడవిలోకి కొందరు స్నేహితులతో ఓ అమ్మాయి వెళ్తుంది. ఎంతమంది వెళ్లారు. ఎంతమంది తిరిగొచ్చారు? అనే ప్రధానాంశంతో రూపొందిన చిత్రం ‘తలకోన’. అప్సర రాణి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు నగేశ్ నారదాసి. దేవర శ్రీధర్‌రెడ్డి నిర్మాత. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘ ప్రకృతి అందాలేకాదు, ప్రకృతిలోని వికృత స్వరూపంకూడా ఇందులో కనిపిస్తుంది.
పాలిటిక్స్‌ని కూడా మిక్స్‌చేసి చూపించాం. నవంబర్ తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం” అని చెప్పారు. ఇంకా నిర్మాత కూడా మాట్లాడారు. అశోక్‌కుమార్, అజయ్‌ఘోష్, ఉగ్రం మంచు, విజయ్ రంగరాజు, రాజారాయ్, యోగి కత్రి తదితరలు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, సమర్పణ: స్వప్న శ్రీధర్‌రెడ్డి.