మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు స్టైలిష్గా ఉండేందుకు ఇష్టపడుతుంటారు.ఆయన ధరించే దుస్తులు, వాడే వస్తువులు చాలా కాస్ట్లీగా ఉంటాయి. డిస్నీ హాట్ స్టార్ తెలుగు వెర్షన్ కి చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా, దీని ప్రమోషన్ బాధ్యతలను రామ్ చరణ్ తీసుకున్నారు.
రీసెంట్గా బిగ్ బాస్ షోకి హాజరైన రామ్ చరణ్ డెనిమ్ జీన్స్ ధరించి స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ధరించిన జాకెట్ ధర చర్చనీయాంశంగా మారింది. ఫ్యాషన్ బ్రాండ్ డస్ట్ ఆఫ్ గాడ్ తయారు చేసిన జోకన్ డెనిమ్ ధర అక్షరాల 1.3 లక్షలు అట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నోరెళ్లపెడుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ఆ మాత్రం రేంజ్ మెయింటైన్ చేయకపోతే ఎలా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతుండగా, ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.