Nazriya Nazim | అందుకే నా రీ ఎంట్రీని సెలబ్రేట్ చేసుకోవడం మానేశారు : నజ్రియా
స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత 2022లో సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుంది.
నజ్రియా నజీమ్ (Nazriya Nazim) ఒక్క నవ్వు నవ్విందంటే చాలు నెటిజన్లు ఫిదా అయిపోవాల్సిందే. ఈ స్టార్ హీరోయిన్ నాని (Nani) నటిస్తోన్న అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతుంది. ఈ భామ 2014లో కొన్ని సినిమాలు చేసింది. కానీ తర్వాత 2018 వరకు మళ్లీ కనిపించలేదు. అటు తర్వాత 2020లో కనిపించగా..రెండేళ్ల గ్యాప్ అనంతరం ఇపుడు అంటే 2022లో సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుంది.
ఇంతకీ ఇలా సినిమాలకు ఎక్కువగా గ్యాప్ రావడానికి గల కారణమేంటో రీసెంట్ చిట్‌చాట్‌లో చెప్పింది నజ్రియా. నేను ఒక సినిమా పూర్తయ్యాక కావాలనే బ్రేక్ తీసుకుంటాను. ఆ బ్రేక్ రెండేళ్ల వరకూ ఉంటుంది. అయితే నేను సినిమాలను తిరస్కరిస్తుంటానని చాలా మంది అనుకుంటారు..కానీ అలాంటిదేమి ఉండదు..నేను సెలవు (వెకేషన్ మూడ్)లో ఉన్నప్పుడు సినిమాలు చేసే మూడ్‌లో ఉండను. కొన్నిసార్లు కథలను విన్పప్పటికీ యాక్టివ్‌గా ఉండను. నా ప్రయాణాలలో నిమగ్నమై ఉంటాను. నా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది.
నేనెక్కువ బ్రేక్ తీసుకుంటుంటాను. మొదట్లో అభిమానులు, ఫాలోవర్లు నా రీ ఎంట్రీని వేడుకగా జరుపుకునేవారు..కానీ నేను సాధారణంగా ఎక్కువగా బ్రేక్ తీసుకుంటానని ఇపుడు నా అభిమానులు అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్లు నా రీఎంట్రీని సెలబ్రేట్ చేసుకోవడం ఇక మానేశారని చెప్పుకొచ్చింది. అయితే ఎక్కువకాలం విరామం తీసుకుంటున్నా ఫ్యాన్స్ తనను గుర్తు పెట్టుకోవడం చాలా సంతోషకర విషయమని అన్నది నజ్రియా.
Read Also : Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!
Read Also : Simbaa first look | చెట్టును మోసుకొస్తున్న జగ్గూభాయ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
Read Also : Kinnerasani | నేరుగా ఓటీటీలోకి మెగాస్టార్ అల్లుడి సినిమా?
Read Also : #NBK108 | రూట్ మార్చబోతున్న అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో అలాంటి సినిమా చేయనున్నాడట!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

