యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన విక్రమ్ (Vikram) సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల పంట పండిస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జూన్ 3న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే తమిళనాడులో కేవలం 3 రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కు దాటేసి..అభిమానుల్లో జోష్ నింపుతోంది. కమల్ సక్సెస్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా ఈ చిత్రంపై స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రశంసలు కురిపించాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
విక్రమ్ సినిమా చూసిన విజయ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడట. అంతేకాదు విక్రమ్ సినిమా కోసం కష్డపడిన టీం మెంబర్స్ పై ప్రశంసలు కురిపించాడు. విజయ్-లోకేశ్ కాంబోలో మాస్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తన అభిమాన హీరో కమల్‌హాసన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూపించిన తీరుకు మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు.
మరోవైపు విక్రమ్ కేవలం 2 రోజుల్లోనే గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి..టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. దశావతారం, విశ్వరూపం సినిమాల తర్వాత ఈ అరుదైన ఫీట్ సాధించిన చిత్రమిదే కావడం విశేషం. రాబోయే రోజుల్లో విక్రమ్ ఏ రేంజ్లో వసూళ్లు చేస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.