ఘన ఆదిత్య, ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘తకిట తదిమి తందాన’. రాజ్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎల్లో మాంగో ఎంటర్టైన్మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. అందమైన ప్రేమకథా చిత్రమిదని, వినోదప్రధానంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎన్.అంజన్, సంగీతం: నరేన్ రెడ్డి, దర్శకత్వం: రాజ్ లోహిత్.