Maruti Nagar Subramanyam | పాపులర్ విలక్షణ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) లీడ్ రోల్లో నటించిన ప్రాజెక్ట్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం (Maruti Nagar Subramanyam). మారుతి నగర్లో సాగే ఫన్ రైడ్‌తో సాగే ఈ చిత్రానికి హ్యాపీ వెడ్డింగ్ ఫేం లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఇంద్రజ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ సినిమాకు వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేసింది.
సినిమాకు అపూర్వమైన మద్దతు తెలిపిన ప్రేక్షకులందరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. సినిమాపై తనకున్న నమ్మకాన్ని అఖండ స్పందనతో ధృవీకరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే స్వచ్చమైన వినోదాత్మక సినిమా. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ను మిస్ కావొద్దని ప్రేక్షకులకు సూచించారు తబిత సుకుమార్.
ఈ చిత్రాన్ని బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ నాయక్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ విడుదల చేసింది.
Arjun Reddy | అర్జున్ రెడ్డి @ ఏడేండ్లు.. సందీప్ రెడ్డి వంగాకు విజయ్ దేవరకొండ ఏం రిక్వెస్ట్ పెట్టాడంటే..?
Megha Akash | రజినీకాంత్‌ను కలిసిన మేఘా ఆకాశ్-సాయి విష్ణు.. స్పెషల్ ఇదే
35 Chinna Katha Kaadu | నివేదా థామస్ 35 చిన్న కథ కాదు థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్..!