Shanmukh Jaswanth | ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లగా.. అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకెళితే.. మౌనిక అనే యువతిని మోసం చేసి.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్. దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుపై సంపత్ వినయ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లగా.. అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. ఇక షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యి విడుదలయ్యాడు.
గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్
పోలీసుల అదుపులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్ సోదరులు.
ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్.
ఆరు రోజుల్లో పెళ్లి.. అంతలోనే మరో యువతితో వివాహం
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై… pic.twitter.com/5n2BvYy7qY
— Telugu Scribe (@TeluguScribe) February 22, 2024