తెలుగు ప్రేక్షకులు సాయిపల్లవిని లేడీ పవర్‌స్టార్‌గా అభివర్ణిస్తారు. అయితే సినిమాల ఎంపికలో ఆమె నిక్కచ్చిగా ఉంటారనేది పలువురి దర్శక నిర్మాతల అభిప్రాయం. నిజానికి తెలుగు, తమిళ భాషలకు చెందిన ఎన్నో కథలు ఆమె వద్దకెళ్లాయి. అందులో ఎక్కువశాతం తిరస్కారానికి గురయ్యాయి. ఆమె మిస్ చేసుకున్న కథలను ఓకే చేసిన హీరోయిన్లు బ్లాక్‌బాస్టర్స్ అందుకొని సక్సెస్ఫుల్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు.
బేసిగ్గా సాయిపల్లవి విద్యాధికురాలు. డాక్టర్ చదివారు. బహుశా సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండటానికి అది కూడా ఓ కారణమని పలువురి అభిప్రాయం. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో ఒకే సినిమా ఉంది. అది కూడా తమిళ సినిమా. శివకార్తికేయ 21వ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారమె. ఇక నుంచైనా వేగంగా సినిమాలను ఓకే చెయ్యాలని, మరిన్ని సినిమాల్లో ఆమె నటించాలని సాయిపల్లవి అభిమానులు కోరుకుంటున్నారు. మరి వారి ఆశ తీరుతుందో లేదో.