అమితాబ్ కోసం పెళ్లి చేసుకోలేదు
‘నిరీక్షణ’, ‘భారత్ బంద్’, ‘లేడీస్ టైలర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయిక అర్చన. ఇంగ్లీష్, బెంగాళీ సహా అన్ని ప్రధాన భారతీయ భాషా చిత్రాల్లో దశాబ్దాల కెరీర్ సాగించిందామె. తమిళ చిత్రం ‘వీడు’ ఆమెకు జాతీయ ఉత్తమ నటిగా పురసారం అందించింది. ఈ నిన్నటితరం హీరోయిన్ పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘చోర్ బజార్’ చిత్రంతో తెలుగు తెరపై కనిపించబోతున్నది. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌తో పాటు చిత్ర విశేషాలను తెలిపారు అర్చన.
సరైన పాత్ర దొరక్కే..
దొరికిన దాంతో సంతృప్తి పడటం నాకు అలవాటు. నటిగా నాకు దక్కిన గుర్తింపు పట్ల సంతోషంగా ఉన్నాను. ఎంతోమంది దర్శకులు నన్ను నటిగా ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ఒక దశలో మన సినిమాల్లో మహిళలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. అప్పటినుంచి నేను తెరకు దూరంగా ఉంటూ వచ్చాను. ప్రాధాన్యత లేని సినిమాల్లో నటిస్తే నాకున్న గుర్తింపు పోతుంది. ఆఫ్ బీట్ సినిమాలు తప్ప పారలల్ సినిమా మన దగ్గర లేదు. వయసైన నాయిక మరొకరికి తల్లి, వదిన, అత్త మాత్రమే. ఆమెకు వ్యక్తిగతంగా స్వేచ్ఛను చూపించే క్యారెక్టర్లు ఉండటం లేదు. కానీ తమిళం, కన్నడ, మలయాళంలో ఆర్ట్ ఫిలింస్‌లో అవకాశం వస్తే నటిస్తూనే ఉన్నాను. తెలుగులో మాత్రమే నటించలేదు. అయితే ఇకడ నుంచి అవకాశాలు రాక కాదు. ప్రతి నెలా కనీసం రెండు సినిమాలకు నన్ను నటించమని అడుగుతుంటారు. నాకెందుకో ఆ పాత్రల్లో నటించాలని అనిపించలేదు.
అమితాబ్ ప్రేమ కోసం
‘జార్జ్ రెడ్డి’ సినిమా చూశాక దర్శకుడు జీవన్ రెడ్డి ఒక కొత్త ప్రయత్నం చేశాడనిపించింది. విమర్శలు వస్తాయని కూడా భయపడకుండా కమిట్మెంట్తో సినిమా చేశాడు. విద్యార్థి నాయకుడి కథను తెరకెకించాడు. ఈ సినిమా కోసం ఆయన నన్ను సంప్రదించినప్పుడు నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, నేను ఎవరికి తల్లి, ఎవరికి వదిన, ఎవరికి అత్త అని అడిగాను. మీరు ఎవరికీ ఏదీ కాదు, ఒక తల్లి, మీ పాత్రకు సొంత వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారు. మీరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, ఆయన్ను ప్రేమిస్తారు. ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోతారు అన్నాడు. ఈ మాటతో షూటింగ్ ఎప్పుడని అడిగా. నిజంగా తమిళనాడులో ఎంజీఆర్ కోసం పెళ్లి చేసుకోని వారున్నారు. అలాగే అమితాబ్ కోసం ఒంటరిగా అలాగే ఉండిపోయినవారున్నారు. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న పాత్ర అనిపించింది. హీరో పేరు బచ్చన్ సాబ్, మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. రెండు నిమిషాలు టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తాను.
మాస్ సినిమా ఇది..
‘చోర్ బజార్’ ఎంటర్టైనింగ్, కమర్షియల్, కలర్ ఫుల్ ఫిల్మ్. అందుకే ఈ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటించాను. ఇదొక మాస్ ఫిలిం. నా జానర్ దాటి బయటకొచ్చి నటించాను. అర్చన అంటే నెక్స్ డోర్ వుమెన్ అనే ఇమేజ్ ఉంది. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. నా వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. ఎస్పీ బాలుతో పాటు కొవిడ్ వల్ల జనం పెద్ద సంఖ్యలో మరణించినప్పుడు మాత్రం కలత పడ్డాను. ఓ వెబ్ సిరీస్‌తో పాటు తమిళ, కన్నడలో ఆర్ట్ ఫిలింస్‌లో నటిస్తున్నాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

