హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ‘తెల్ల కాగితం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. థియేటర్ విజిట్స్ వెళ్లినప్పుడు ప్రేక్షకులు అద్భుతమైన స్పందన కనబరిచారని, ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడాల్సిన చిత్రమిదని అన్నారు.
అందరూ కొత్తవాైళ్లెనా గొప్ప సందేశంతో సినిమా చేశారని అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు అందించిన ప్రశంసలు తనలో ఉత్సాహాన్ని నింపాయంటూ దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సినిమాకు రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయని, అద్భుతమైన ప్రేక్షకాదరణ లభిస్తున్నదని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.