Adipurush | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా ఆదిపురుష్ (Adipurush). మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రాష్ట్రప్రభుత్వం ఆదిపురుష్ విడుదల రోజు ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రారంభం కానున్నాయి.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 పెంచుకునే అవకాశం ఇచ్చింది. మొదటి 3 రోజులు టికెట్ ధర పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం టికెట్ ధర రూ.175 ఉండగా.. దీనికి అదనంగా రూ.50 చెల్లించాలి. మరోవైపు టికెట్ల అమ్మకం విషయంలో ఆదిపురుష్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. పీవీఆర్ ఐనాక్స్ లో లక్ష టికెట్లు బుక్కయ్యాయంటే బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ భామ కృతిసనన్ సీతగా నటిస్తోంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తోండగా.. సైఫ్ అలీ ఖాన్రావణాసురుడి (లంకేశ్)గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవ్‌దత్తా నగే హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సాచెట్-పరంపర ఆదిపురుష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Adipurush2
ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్..