OG Movie : పవన్ కల్యాణ్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘ఓజీ’ (OG Movie) టికెట్ల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ ధరల్ని పెంచుకోవచ్చని తెలిపింది. అంతేకాదు స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి కూడా ఇచ్చేసింది. దాంతో, పవర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు ఓజీ ప్రత్యేక ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ షో టికెట్ ధర రూ. 800. సింగిల్ స్క్రీన్‌లో రూ.277, మల్టీఫ్లెక్స్‌లో రూ.445 వరకూ ఉండనుంది. సిసినిమా విడుదలైన పది రోజుల పాటు పెంచిన టికెట్ ధరలు వర్తించనున్నాయి. పదకొండో రోజు నుంచి సింగిల్ స్క్రీన్లలో రూ.177, మల్టీ ఫ్లెక్స్‌లో రూ.295 నుంచి టికెట్లు లభిస్తాయి.
#OG Paid Premieres on 24th September Confirmed!!
Telangana Ticket Hike with 9PM Paid Premieres @ ₹800!
Day1-10
Singles upto ₹277 and Plexes upto ₹445Day11-(Max Standard)
Singles ₹177 & Plexes ₹295 pic.twitter.com/uJkGagNNdZ— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) September 19, 2025
ఈమధ్యే ‘హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu)తో ఫ్యాన్స్‌ను పలకరించిన పవన్.. ఈసారి ఓజీతో థియేటర్లలో సందడి చేయనున్నారు. ‘సాహో’ ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.