మోసం చేసేది ఎవరో?
ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన రియాలిటీ షో ‘ది ట్రెయిటర్స్' తెలుగులో రాబోతున్నది. ఈ షోకు యువ హీరో తేజ సజ్జ ప్రయోక్తగా వ్యహరించనున్నారు. మొత్తం పది ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్‌తో ముందుకురానుంది.
ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన రియాలిటీ షో ‘ది ట్రెయిటర్స్’ తెలుగులో రాబోతున్నది. ఈ షోకు యువ హీరో తేజ సజ్జ ప్రయోక్తగా వ్యహరించనున్నారు. మొత్తం పది ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్‌తో ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హీరో తేజ సజ్జ విలేకరులతో మట్లాడారు. ‘మిరాయ్’ సినిమా తర్వాత ప్రైమ్ వీడియో తనను సంప్రదించగా ఫార్మాట్‌పై నమ్మకంతో వెంటనే అంగీకరించానన్నారు. ‘ఈ షో మర్డరీ మిస్టరీ థ్రిల్లర్‌ను చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.
ఇప్పటివరకు వచ్చిన తెలుగు రియాలిటీ షోలకు భిన్నంగా ఉంటుంది. ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? ఎవరు ట్రెయిటర్స్? ఎవరు అమాయకులు? అనే ఉత్కంఠతో సాగుతుంది. ఇందులో 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. వారి ఎంపికలో ఆడే సామర్థ్యం, నమ్మించడం, వ్యూహాలు పన్నడం వంటి లక్షణాలకు ప్రాధాన్యం ఇచ్చాం. 11 రోజుల్లో 10 ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయింది, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేసే షో ఇది’ అన్నారు. తన తదుపరి చిత్రం ‘జాంబిరెడ్డి-2’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని, మంచి క్రేజీ ఎంటర్టైనర్గా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తేజ సజ్జ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

