Teja | టాలీవుడ్ డైరెక్టర్ తేజ (Teja) ప్రస్తుతం అహింస ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ జూన్ 2న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తేజ. ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి చెప్పిన మాటలు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు ఎలాంటి సినిమాలు సెట్ అవుతాయని యాంకర్ తేజను అడిగారు. దీనికి తేజ స్పందిస్తూ..ఇటీవలే విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh) గ్లింప్స్ చాలా నచ్చిందన్నాడు.
పవన్ కల్యాణ్‌ను పర్ఫెక్ట్గా ఎలా చూపించాలో.. అలా చూపించడం జరిగిందని చెప్పాడు తేజ. గ్లింప్స్ వీడియోలో పవన్ కల్యాణ్ ఆటిట్యూడ్ చాలా బాగా నచ్చిందని, ఉస్తాద్ భగత్ సింగ్ పక్కా హిట్ అవుతుందని నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చాడు. పవర్ స్టార్‌పై తేజ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ పై తేజ కామెంట్స్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్ ధన్యవాదాలు తెలియజేశాడు. మరి అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ చెబుతున్న డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇదే కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలువబోతుందని గ్లింప్స్ చెబుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..