Tamannaah Bhatia | ముంబై నుంచి వచ్చి టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారిన భామల్లో టాప్‌లో ఉంటుంది తమన్నా (Tamannaah Bhatia). శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ మిల్కీ బ్యూటీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని సాగిస్తుంది. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న తమన్నా సూపర్ స్టార్ మహేశ్ బాబు (MaheshBabu)తో కలిసి ఆగడు సినిమాలో మెరిసిందని తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.
చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్ బాబుతో కలిసి స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది తమన్నా. ఈ క్రేజీ స్టార్ యాక్టర్లు మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. అలాంటి టైమే మళ్లీ వచ్చేసింది. మహేశ్ బాబు, తమన్నా మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. ఇంతకీ ఈ ఇద్దరు ఏ సినిమా చేస్తున్నారనే కదా మీ డౌటు. వీరిద్దరూ షూట్లో పాల్గొన్నది నిజమే.. కానీ సినిమా కోసం కాదు.. ఓ యాడ్ షూట్ కోసం. Llyod యాడ్ షూట్లో భాగంగా ఇలా కెమెరా ముందుకొచ్చారు మహేశ్, తమన్నా .
తమన్నా మరోసారి సూపర్ క్యూట్‌గా మెస్మరైజింగ్ లుక్‌తో అదరగొట్టేస్తుండగా.. మహేశ్ బాబు ఎప్పటిలాగా తన చిరునవ్వుతో అందరినీ కట్టిపడేస్తున్నాడు. తమన్నా, మహేశ్ యాడ్ షూటింగ్ ఫొటోలు ఇప్పుడు మూవీ లవర్స్ మనసు దోచేస్తున్నాయి.
యాడ్ షూట్లో ఇలా..
.@tamannaahspeaks & @urstrulyMahesh shot for Llyod ad in Hyderabad today 😍 #Tamannaah #TamannaahBhatia #MaheshBabu #GunturKaraam pic.twitter.com/bmHm13khMV
— Miss B fan(Tammu fan😘❣️) (@MissB_Fan) January 10, 2024