Tamanna About Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ఇండస్ట్రీలో చాలా మంది సింపుల్ మ్యాన్ అని అంటుంటారు. అంతేకాకుండా ఆతిథ్యం ఇవ్వడంలో ఆయనకు మించినోళ్లు లేరని అంటుంటారు. షూటింగ్లో ఉన్నప్పుడు తనతో నటించే నటీనటులకు ప్రభాస్ ఇంటి నుంచి రకరకాల రుచికరమైన వంటకాలు వెళ్తుంటాయని ఎంతో మంది సెలబ్రెటీలు చెప్పారు. అంతేనా ప్రభాస్ ఇచ్చే విందును ఫోటోలు తీసి నెట్టింట అభిమానులతో పంచుకుంటుంటారు. బిగ్‌బి అమితాబ్, పూజాహెగ్డే, శృతిహాసన్ ఇలా పలువురు స్టార్లు ప్రభాస్ ఆతిథ్యం గురించి చెప్పారు. కాగా తాజాగా ఈ జాబితాలో తమన్నా చేరింది.
తాజాగా తమన్నా ఓ ఇంటర్వూలో ప్రభాస్ ఆతిథ్యం గురించి మాట్లాడుతూ.. ప్రభాస్‌కు చాలా మంది అభిమానులున్నారని, అతను తన ఇంటికి వచ్చిన అతిథులను ఎలా చూసుకుంటారో దేశమంతా తెలుసని చెప్పింది. ఆయన భోజనానికి పిలిస్తే అందులో కనీసం 30 రకాల వంటకాలు ఉంటాయిని, డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదని వెల్లడించింది. అంతేకాకుండా ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా ఒక రాజు ఎలా ఉంటాడో ప్రభాస్‌ను చూస్తే తెలుస్తుందని చెప్పుకొచ్చింది. ఆయన్ని అభిమానులు ఎంతగా ఇష్టపడతారో అతడికి తెలియదు. అంత పెద్ద స్టార్ అయినా.. చాలా సాధారణంగా ఉంటాడు అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది.
కాగా వీరిద్ధరూ రెబల్ సినిమాలో కలిసి నటించారు. లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయం మూటగట్టుకుంది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత హ్యట్రిక్ కొట్టాలనుకున్ ప్రభాస్‌ను ఈ మూవీ నిరాశపరిచింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.