Bhola Shankar | టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుత్ను ఈ మూవీకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna Bhatia)ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ నెట్టింట వ్యూస్ పంట పండిస్తోంది. కాగా తమన్నా భోళాశంకర్ తాజా అప్డేట్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
సినిమా షూటింగ్ చివరి రోజు.. అంటూ కోస్టార్ కీర్తిసురేశ్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసింది తమన్నా. ఇప్పుడీ ఫొటో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. భోళా శంకర్ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. భోళా శంకర్‌లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవలే లాంఛ్ చేసిన భోళామేనియా సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. చిరంజీవి మరోవైపు బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమా చేస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.