Thalaivar 171 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం తలైవా 170 (Thalaivar 170) షూటింగ్‌తో బిజీగా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే
మరోవైపు ఇప్పటికే లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) డైరెక్షన్లో తలైవా 171 (Thalaivar 171) అప్డేట్ కూడా వచ్చేసింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. వన్ ఆఫ్ ది కోలీవుడ్ లీడింగ్ హీరో శివకార్తికేయన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తన ఫేవరేట్ స్టార్ హీరో తలైవాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని కోలీవుడ్ సర్కిల్ టాక్. మరోవైపు లారెన్స్, జయం రవి కూడా కనిపించబోతున్నారని టాక్ నడుస్తుండగా.. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇటీవలే ఓ చిట్‌చాట్‌లో లోకేశ్ మాట్లాడుతూ.. రజినీకాంత్‌లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని, నెక్ట్స్ సినిమాలో తలైవాలోని నెగెటివ్ షేడ్స్‌ను మరోసారి చూపించబోతున్నానని చెప్పాడు. రోబో సినిమా తర్వాత తలైవా 171లో తలైవా విలనిజాన్ని ఎలివేట్ చేయబోతున్నా. అంతేకాదు రజినీకాంత్ పాత్రకు చాలా షేడ్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చేశాడు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు తలైవా 171 చిత్రంలో రజినీలోని మరో కోణాన్ని పూర్తిగా ఆవిష్కరించబోతున్నానని, ఇది తన కెరీర్లోనే ఉత్తమ కథ అని చెప్పుకొచ్చాడు లోకేశ్ కనగరాజ్.
రజినీకాంత్ మరోవైపు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో లాల్‌సలామ్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2024 పొంగళ్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
Fanboys reunion for Superstar #Rajinikanth & Ulaganayagan #KamalHaasan‘s Most anticipated upcoming project🤝🔥#Thalaivar171 – Sivakarthikeyan✅& Lawrence (Buzz)#ThugLife – JayamRavi
Seems a strong pivotal role awaiting for them🤞 pic.twitter.com/tC5KI3i1Xf
— AmuthaBharathi (@CinemaWithAB) November 27, 2023
I like Rajni Sir’s negative shade performances. I will try to bring it as much as I can in #Thalaivar171 💥
– Lokesh Kanagaraj pic.twitter.com/5xtDSAqwtI
— Bharathi (@Bharathistweets) October 31, 2023
Loki planning to Quit from #Thalaivar171 ( An Un Announced Project ) which is Planned to Announce after #Leo ~
First Loki told about the Sniper scene in #LokeshKanagaraj to Rajini movie – #Thalaivar171 & Without Loki’s Knowledge – Rajinikanth told that Sniper scene to Nelson,… pic.twitter.com/kyRcYuoBWn
— Roвιɴ Roвerт (@PeaceBrwVJ) September 10, 2023
లాల్‌సలామ్ షూటింగ్ పూర్తి..
As the shoot 📽️ of #LalSalaam is completely wrapped, the team get together once again to rejoice it! 🤗✨ Off to the post-production now!#LalSalaam 🫡
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj… pic.twitter.com/znDsyIfuzH— Lyca Productions (@LycaProductions) August 9, 2023