Nagarjuna | కింగ్ నాగార్జున 100వ సినిమాలోవిలన్గా టబూ .. జూలై 10 తర్వాత రానున్న అప్డేట్పై భారీ ఆసక్తి!
Nagarjuna | టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 100వ సినిమాపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నాగార్జున, తన మైలురాయి చిత్రం కింగ్100 కు సంబంధించిన అధికారిక అప్డేట్ను జూలై 10, 2026 తర్వాత వెల్లడిస్తానని ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి.
Nagarjuna | టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 100వ సినిమాపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నాగార్జున, తన మైలురాయి చిత్రం కింగ్100 కు సంబంధించిన అధికారిక అప్డేట్ను జూలై 10, 2026 తర్వాత వెల్లడిస్తానని ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్తలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు, అంతేకాదు ఆమె ఈసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న ప్రధాన ప్రతినాయక పాత్రను పోషించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
గతంలో నాగార్జున, టబూ కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అందుకే ఈసారి కూడా ఇద్దరూ జంటగా కనిపిస్తారని చాలామంది భావించారు. అయితే తాజా ప్రచారం ప్రకారం, టబూ ఈ చిత్రంలో హీరోయిన్గా కాకుండా నాగార్జునకు ఎదురుగా నిలిచే ప్రధాన ప్రతినాయకురాలి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే, ఇద్దరూ తొలిసారి పూర్తిగా భిన్నమైన పాత్రల్లో తలపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ‘కింగ్100’ ఓ ర్యాగ్స్-టు-రిచెస్ డ్రామాగా రూపొందుతోంది. తండ్రి-కూతురు మధ్య సాగే భావోద్వేగ కథ ఈ సినిమాకు ప్రధాన బలంగా ఉండనుందని టాక్. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండగా, యువ నటి సుష్మిత భట్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించేందుకు మేకర్స్ ఇప్పటికే పలుమాసాలుగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తన 100వ సినిమా గురించి జూలై 10 తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని నాగార్జున స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైటిల్, నటీనటులు, ఫస్ట్ లుక్, షూటింగ్ అప్డేట్స్ వంటి కీలక విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మరోవైపు టబూ పాత్రకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- announcement
- Birthday
- king
- KING 100
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

