Tapsee Pannu | ‘ఝుమ్మంది నాదం’లో బూరెబుగ్గల భామగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను(Tapsee Pannu). అందం, అభినయంతో మంచి నటిగా పేరు తెచ్చుకుని బాలీవుడ్లో సైతం తనను తాను నిరూపించుకుంది. గతేడాది ‘శభాష్ మిథూ’ (Shabash Mithu) సినిమాతో అలరించిన ఈ భామ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డంకీ (DUNKI). బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) హీరోగా వస్తున్న ఈ సినిమాను మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్ (Munnabhai MBBS). త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే (PK) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తీసిన రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాప్సీకి కార్లు ఇష్టమన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే తాప్సీ గ్యారేజీలో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఈ గ్యారేజీలోకి మరో కోట్ల రూపాయల విలువ చేసే కారు వచ్చి చేరింది. గణేష్ చతుర్థి సందర్భంగా తాప్సీ లేటెస్ట్ వర్షన్ మెర్సిడెస్-మేబ్యాక్ (Mercedes-Maybach GLS600 SUV) కారును కొనుగోలు చేశారు. అయితే ఈ కారు ఖరీదు అక్షరాల రూ.3.5 కోట్లు. ఇక సిల్వర్ షేడ్‌లో ఉన్న ఈ కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Taapsee Pannu purchases a brand new Mercedes Maybach GLS SUV worth ₹2.92 cr [Ex-Showroom]#TaapseePannu #Bollywood #Mercedes@taapsee pic.twitter.com/2N2WiEJNNU
— Mahendra Singh Dhoni 🇮🇳 (@alvi_murtaza7) September 20, 2023