కథకు ప్రాధాన్యతనిచ్చి, ఆ కథలో తన పాత్ర పరిధి ఎంత ఉన్నా.. నటించే జెన్యూన్ హీరోలు నేటికాలంలో లేరని నటి తాప్సీ అన్నారు. ఇటీవలే బాలీవుడ్లో హీరోల ఆధిపత్య ధోరణి, అభద్రతాభావంపై తాప్సీ హాట్ హాట్ కామెంట్లు చేశారు. ఇంకా మాట్లాడుతూ ‘సినిమాలో తన పాత్ర కంటే హీరోయిన్ పాత్ర ఎక్కువగా ఉందంటే, చిన్నహీరోలు కూడా నటించడానికి వెనకడగు వేస్తున్నారు. కథ ఎంత గొప్పదైనా సరే.. హీరోయిన్ డామినేషన్ని మాత్రం వాళ్లు సహించలేరు.
ఈ అభద్రతాభావం చాలామంది హీరోలకు ఉంది. తెరపై హీరోయిన్ హైలైట్ అయితే.. తన ఇమేజ్ దెబ్బతింటుందని వారి భావన. ఇలా అయితే.. మంచి కథలు ఎలా వస్తాయి?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది తాప్సీ పన్ను. ‘కేవలం తమ పాత్రలకు మాత్రమే ప్రాధాన్యత ఉండాలి, హీరోయిన్లు పాటలకు మాత్రమే పరిమితం కావాలనే పాతకాలపు ఆలోచనల నుంచి పరిశ్రమ బయటకు రావాలని, నిజాయితీగా కథను ప్రేమిం చే నటులు ఉంటే వైవిధ్యమైన సినిమాలు వస్తాయని తాప్సీ అభిప్రాయపడింది.