విశ్వక్సేన్, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణచైతన్య దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ,సాయి సౌజన్యనిర్మాతలు. ఈ చిత్రంలోని మొదటి గీతం ‘సుట్టంలా సూసి’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇటీవల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘గోదావరి డెల్టా నేపథ్యంలో కొనసాగే పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది.
యువన్ శంకర్‌రాజాతో పనిచేయాలన్న నా కోరిక ఈ చిత్రంతో తీరింది. ఆయనకు నేను పెద్ద అభిమానిని’ అన్నారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘తాజాగా విడుదల చేసిన పాట సాఫ్ట్‌గా వుంటుంది. కానీ సినిమా మాత్రం మాస్‌గా వుంటుంది. థియేటర్లలో ఒక్కొక్కరికి శివాలెత్తిపోతుంది’అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహాశెట్టి, నిర్మాత నాగవంశీ, యువన్ శంకర్‌రాజా తదితరులు పాల్గొన్నారు.