‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీం’ సినిమాలతో చక్కటి విజయాల్ని సొంతం చేసుకున్నారు అగ్రహీరో సూర్య. ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఈటీ’ (ఎతార్కుం తునిందావన్). సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ఈ సినిమా తెలుగు హక్కుల్ని సొంతం చేసుకుంది. సూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్సీ రేటుకు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకులముందుకు రానుంది. మహిళపై జరిగే అకృత్యాలపై పోరాడే ధీరోదాత్తుడైన వ్యక్తిగా హీరో సూర్య పాత్ర చిత్రణ శక్తివంతంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో తన పాత్రకు సూర్య సొంతంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నారు. వినయ్‌రాయ్, సత్యరాజ్, రాజ్‌కిరణ్, శరణ్య పొన్వన్నన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: ఆర్.రత్నవేలు, సంగీతం: ఇమ్మాన్.