Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న చిత్రం కంగువ (Kanguva). సూర్య 42 ప్రాజెక్ట్‌గా శివ (siva) దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో వస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నేడు కంగువ గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియోను విడుదల చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. సూర్య ఇదివరకెన్నడూ కనిపించని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న విజువల్స్‌లో వారియర్‌గా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. ఆ తర్వాత విడుదల చేసిన కంగువ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. తాజా లుక్ వారియర్.. లీడర్.. కింగ్.. క్యాప్షన్‌తో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
సూర్య రాజసం ఉట్టిపడేలా గుర్రంపై వస్తున్న వారియర్ లుక్‌తో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన కంగువ పోస్టర్లు సోషల్ మీడియాను వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కంగువ థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ౩డీ ఫార్మాట్లో కూడా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. 2024 ఫస్ట్ హాఫ్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. కంగువ సీక్వెల్‌కు కూడా ఛాన్స్ ఉందన్న వార్తలతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
కంగువ నయా లుక్..
కంగువ గ్లింప్స్ అప్డేట్ లుక్..
Each scar carries a story!
The King arrives 👑#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth@KanguvaTheMovie #Kanguva 🦅 pic.twitter.com/CV5iktmMHG
— Studio Green (@StudioGreen2) July 20, 2023
కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో..
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023