కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం జై భీమ్ (Jai Bhim) . ఇంటెన్స్ సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీజే జ్ఞానవేళ్ (T. J Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. సూర్య తన 4 సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయ్యాడని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నాలుగు సినిమాల్లో ఒకటైన జై భీమ్ విడుదల తేదీని ఫిక్స్ చేశాడు సూర్య.
నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో జై భీమ్ విడుదల కానుంది. ఈ చిత్రంలో రజీష విజయన్, లిజోమోల్ జోస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు స్టార్ హీరో మాధవన్ నటిస్తోన్న రాకెట్రీ చిత్రంలో సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతోపాటు తమిళంలో మరో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. సూర్య నిర్మాతగా ఉదన్ పిరప్పే, ఓ మై గాడ్ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. ఓ వైపు హీరోగా అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూనే..మరోవైపు నిర్మాతగా కూడా బిజీగా మారిపోయాడు సూర్య.
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?