Kanguva Movie glimps | రజనీ, కమల్ తర్వాత ఆ స్థాయిలో తెలుగులో క్రేజ్ ఉన్న నటుడు సూర్య. తమిళంలో సూర్యకు ఎంత పాపులారిటీ ఉందో తెలుగులోనూ అంతే ఉంది. ఆయన సినిమాలు రిలీజవుతున్నాయంటే ఇక్కడ కూడా భారీ రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. కాగా గత కొంత కాలంగా సూర్య సినిమాలు కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోతున్నాయి. గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజైన ఈటీ తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ ఫలితం మూటగట్టుకుంది. ప్రస్తుతం సూర్య కంగువా అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా గ్లింప్స్‌ను సూర్య బర్త్‌డే సందర్భంగా జూలై 28న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో సూర్యను సరికొత్త అవతారంలో శివ చూపించనున్నాడు. దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు. యూవీ క్రియేషన్స్, స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.