Suriya 44 First Shot | ‘జిగర్ తండా డబుల్ ఎక్స్'(Jigarthanda Double X)తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) తన తదుపరి సినిమాను తమిళ స్టార్ హీరో సూర్యతో చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్య44 రానున్న ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా బుట్టబోమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ నుంచి ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో సముద్రం వైపు చూస్తూ.. ప్రపంచాన్ని ఏలుదామని బ్యాగ్ పట్టుకొని సూర్య బయలుదేరుతున్నట్లు ఈ వీడియో ఉంది. ఈ మూవీ షూటింగ్ అండమాన్ ఐలాండ్‌లో మొదలుకానుంది. పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సైంధవ్ ఫేం సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందించనున్నాడు.
Lights! Camera!! Action!!!#Suriya44FirstShot#LoveLaughterWar ❤️🔥 #AKarthikSubbarajPadam📽️ Begins Today@Suriya_Offl @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens @kshreyaas @cheps911 @jacki_art @JaikaStunts @PraveenRaja_Off #Jayaram #Karunakaran… pic.twitter.com/URzLJqGH1w
— BA Raju’s Team (@baraju_SuperHit) June 2, 2024