Suriya 42 | క్రేజీ టాక్.. Suriya 42 టైటిల్ ప్రకటించే తేదీ ఫిక్స్..!
సూర్య (Suriya) తాజా చిత్రం సూర్య 42 (Suriya 42). ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, ప్రోమో త్వరలోనే రాబోతున్నాయని ఇప్పటికే ఓ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పుడు సినిమా టైటిల్ ఎప్పుడు లాంఛ్ చేస్తారన్న న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తాజా చిత్రం సూర్య 42 (Suriya 42). పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, ప్రోమో త్వరలోనే రాబోతున్నాయని ఇప్పటికే ఓ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పుడు సినిమా టైటిల్ ఎప్పుడు లాంఛ్ చేస్తారన్న న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. తాజా టాక్ ప్రకారం సూర్య 42 టైటిల్‌ను మార్చి 14న రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సూర్య 42 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్నిసంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి వెట్రి పలనిస్వామి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.
సూర్య 42 ప్రాజెక్ట్ 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సూర్య 42 లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సూర్య ఈ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించనట్వంటి సరికొత్త పాత్రలో మెరువబోతున్నాడు. ప్రస్తుతం సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్య బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ నటిస్తోన్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. దీంతోపాటు వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.
Read Also :
Oscars 2023 | ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేదా..? అయితే ఈ ఛానళ్లలో ఆస్కార్స్ ఈవెంట్‌ను వీక్షించండి..!
Jr NTR | హాలీవుడ్ స్టార్‌తో జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్‌లో స్టిల్
Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ సినిమాకు డిఫరెంట్ టైటిల్.. లుక్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

