సురవరం జీవితం నేటి తరానికి ఆదర్శం
తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సురవరం ప్రతాప్‌రెడ్డి జీవితంపై సురవరం ప్రతాప్‌రెడ్డి సాహితీ వైజయంతి ట్రస్ట్ తీసిన ‘ సురవరం’ బయోపిక్ సినిమా ప్రివ్యూ ప్రదర్శన మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో నిర్వహించారు.
తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సురవరం ప్రతాప్‌రెడ్డి జీవితంపై సురవరం ప్రతాప్‌రెడ్డి సాహితీ వైజయంతి ట్రస్ట్ తీసిన ‘ సురవరం’ బయోపిక్ సినిమా ప్రివ్యూ ప్రదర్శన మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత వి.శ్రీనివాస్‌గౌడ్, దర్శకులు శేఖర్ కమ్ముల, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ట్రస్ట్ ఉపాధ్యక్షుడు కొండా లక్ష్మీకాంత్‌రెడ్డి, సన్‌షైన్ హాస్పిటల్స్ డైరెక్టర్ డా. గురవారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాను తిలకించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..నిజాం నిరంకుశపాలనలో తెలంగాణ ప్రజల దీనస్థితికి స్పందించిన సురవరం ప్రతాప్‌రెడ్డి సమాజాన్ని తన రచనల ద్వారా జాగృతం చేయడంతో పాటు పోరాటాన్ని నడిపించారన్నారు. నేటి తరానికి ఇలాంటి సినిమాలు స్పూర్తిని కలిగిస్తాయన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో మాతృభాష తెలుగులో చదువుకునే పరిస్థితి సైతం ఉండేది కాదని, అలాంటి పరిస్థితిలో సురవరం తెలుగు భాష కోసం చేసిన కృషి చరిత్ర ఎన్నటికీ మరువదన్నారు. ఈ కార్యక్రమంలో సురవరం చిత్ర దర్శకుడు బీఎమ్.రెడ్డి, హర్షవర్దన్రాయల్, విజయప్రసాద్, సురవరం కుటుంబసభ్యులు డా.సురవరం కృష్ణవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, కపిల్, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

