సూపర్ సర్ప్రైజ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ రీల్ లైఫ్‌కీ రియల్లైఫ్కీ సంబంధం ఉండదు.. సినిమాల్లో సూపర్ నేచురల్ పవర్‌లా కనిపించే ఆయన.. బయట మాత్రం సాధారణ వ్యక్తిగా బతకడానికే ఇష్టపడతారు. వయసైన స్టార్లంతా వయసు దాచుకోడానికి ప్రయత్నిస్తుంటే.. తలైవా మాత్రం బయట కూడా 70ప్లస్గానే కనిపిస్తారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ రీల్ లైఫ్‌కీ రియల్లైఫ్కీ సంబంధం ఉండదు.. సినిమాల్లో సూపర్ నేచురల్ పవర్‌లా కనిపించే ఆయన.. బయట మాత్రం సాధారణ వ్యక్తిగా బతకడానికే ఇష్టపడతారు. వయసైన స్టార్లంతా వయసు దాచుకోడానికి ప్రయత్నిస్తుంటే.. తలైవా మాత్రం బయట కూడా 70ప్లస్గానే కనిపిస్తారు. ఒక్కోసారి ఒంటరిగా దేవాలయ దర్శనాలకి వెళ్లిపోతుంటారు. అంతేకాదు తన మూలాలని ఆయన ఎప్పటికీ మరిచిపోరు. అందుకు ఉదాహరణే రీసెంట్ జరిగిన సంఘటన. వివరాల్లోకెళ్తే.. రజనీ సినిమాల్లోకి రాకముందు బెంగళూర్‌లో సిటీబస్ కండక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. సూపర్‌స్టార్‌గా ఈ స్థాయికి వచ్చాక మళ్లీ ఆయనకు తన మూలాలని స్పృశించాలనే కోరిక కలిగినట్టుంది.
తాను పనిచేసిన బెంగళూర్‌లోని బీఎండీసీ బస్ డిపోకి సడెన్‌గా వెళ్లి అక్కడివారందర్నీ షాక్‌కు గురిచేశారు తలైవా. సూపర్‌స్టార్‌ని చూడగానే అక్కడున్న డ్రైవర్లూ కండక్టర్లూ ఇతర కార్మికులు ఆశ్చర్యానందానికి గురయ్యారు. వారందరితో కాసేపు ముచ్చటించి సరదాగా గడిపారు రజనీ. వారితో సెల్ఫీలు కూడా దిగారు. ఈ విషయం బయటకు ఎలా పొక్కిందోఏమో.. బెంగళూర్‌లోని ఆయన ఫ్యాన్సంతా పెద్ద సంఖ్యలో డిపో దగ్గరకు చేరుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో బాగా ప్రచారంకి వచ్చాయి. అదీగాక ఇటీవల విడుదలైన రజనీ ‘జైలర్’ సినిమా ఆయన కెరీర్లోనే భారీ విజయంగా నమోదై ఇప్పటికే 600కోట్ల మార్క్‌ని దాటేసింది. ఈ నేపథ్యంలో తలైవా బెంగళూర్‌లో సందడి చేయడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

