సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ మామూలుగా లేదుగా.. 15 సినిమాలతో బిజీ..

Sunil | సునీల్.. ఈ పేరు వినగానే తెలియకుండానే మన మొహంపై చిరునవ్వు వస్తుంది. ఒకటి రెండు కాదు 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు కమెడియన్ సునీల్. అందుకే అతి తక్కువ కాలంలోనే దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించాడు. ఒక సమయంలో బ్రహ్మానందం తర్వాత అంతటి రెమ్యునరేషన్ అందుకున్న కమెడియన్‌గా మారాడు. ఆ తర్వాత అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు సినిమాలతో హీరోగానూ సక్సెస్ అయ్యాడు. అయితే అదే ఊపు కంటిన్యూ చేయడంలో దారుణంగా విఫలమయ్యాడు సునీల్. గత కొన్నేళ్లుగా ఆయన హీరోగా నటించిన సినిమాలు వచ్చినట్లు ప్రేక్షకులకు గుర్తు లేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు సునీల్. రీ ఎంట్రీ ఇస్తున్నాడు అంటే మళ్ళీ కమెడియన్‌గా సెటిల్ అయిపోతాడని అంతా అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు సునీల్.
తన కెరీర్ ముందు నుంచి కూడా విలన్ పాత్రలు చేయాలనే ఆశ ఉండేదని.. అది ఇప్పుడు తీరుతుంది అంటున్నాడు సునీల్. డిస్కో రాజా, కలర్ ఫోటో లాంటి సినిమాల్లో ఇప్పటికే విలన్‌గా నటించాడు సునీల్. ఇక ఇప్పుడు ఈయన సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయే క్యారెక్టర్స్‌తో ముందుకు వెళ్తుంది. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ గెటప్ చూసిన తర్వాత ఈ సినిమాలో సునీల్ పాత్ర ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. అలాగే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడు సునీల్.
శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనూ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎంటర్టైనర్ ఎఫ్ 3 సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు సునీల్. ఇది పూర్తిగా తన స్టైల్ ఆఫ్ కామెడీలో సాగిపోతుంది. ఇవి మాత్రమే కాకుండా మరో 10 సినిమాలకు సైన్ చేశాడు ఈ భీమవరం బుల్లోడు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో కూడా కీలక పాత్ర చేయబోతున్నాడు. ఇప్పుడు చేసే క్యారెక్టర్స్ అన్నీ.. ఇది వరకు తాను ఎప్పుడూ చేయలేదు.. కచ్చితంగా మీరు కొత్త సునీల్ ను తెరపై చూస్తారు అంటూ నమ్మకంగా చెబుతున్నాడు సునీల్. మరి ఈ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RC15 | సునీల్ పాత్రను శంకర్ ఎలా డిజైన్ చేశాడో తెలుసా..?
సునీల్ ‘అందాల రాముడు’ ముందుగా ఎవరు చేయాల్సిందో తెలుసా..?
ఎన్టీఆర్ సినిమా కోసం కమెడీయన్‌ను విలన్‌గా మారుస్తున్న త్రివిక్రమ్
సూపర్ స్టార్ కృష్ణతో పూరీ జగన్నాథ్ మూవీ.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
Kajal | ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన కాజల్.. ఇప్పటికే తల్లిలా ఫీలవుతున్నా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

