Kajal Aggarwal | మగధీర చిత్రంలో మిత్రవిందగా కనిపించి అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. దాదాపు 10 ఏళ్లకు పైగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది కలువ కళ్ల చిన్నది కాజల్ అగర్వాల్. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. పాండమిక్ టైంలో గతేడాది అక్టోబర్ 30న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఇటీవల కాజల్ యానివర్సరీ కూడా జరుపుకుంది. అయితే గత కొద్ది రోజులుగా కాజల్ గర్భవతి అంటూ సోషల్ మీడియాలో పుకార్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. తాజాగా వీటిపై ఓ ఇంటర్వూలో స్పందించింది కాజల్. సమయం వచ్చినప్పుడు దీనిపై నేను స్పందిస్తాను. మాతృత్వం అనేది అందరికి అద్భుతమైన అనుభూతి. నా చెల్లి పిల్లలని చూసి నేను ఇప్పటికే తల్లిలా ఫీలవుతున్నాను.
మరోవైపు నాకు భిన్నమైన భావం కూడా కలుగుతోంది. ఒక్కోసారి తల్లి కావాలి అనే భావన నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నాని తెలిపింది కాజల్. ప్రస్తుతం కాజల్ ఉమ అనే సినిమా చేస్తుండాగా, ఇది ఫీల్ గుడ్ హ్యాపీ ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకొచ్చింది.