Ooru Peru Bhairavakona | సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన చూడలేదా..? అయితే ఈ వార్త మీ కోసమే
Ooru Peru Bhairavakona | సందీప్ కిషన్ (Sundeep Kishan) నటించిన చిత్రాల్లో ఒకటి ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
Ooru Peru Bhairavakona | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ యంగ్ యాక్టర్ నటించిన చిత్రాల్లో ఒకటి ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించింది. ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఆ తర్వాత మార్చి 8న పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ చిత్రానికి థియేటర్లలో, ఓటీటీలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మూవీ ఇక టీవీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఊరి పేరు భైరవ కోన వరల్డ్ టెలివెజన్ ప్రీమియర్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న జీ తెలుగులో ప్రీమియర్ కానుంది. కొన్ని సార్లు థియేటర్లు, ఓటీటీలో ఆశించిన టాక్ తెచ్చుకోని సినిమాలు కూడా.. టీవీలో మంచి టీఆర్పీ రేటింగ్ నమోదు చేశాయని తెలిసిందే. మరి సందీప్ కిషన్ తాజా సినిమా టీవీలో ఎలాంటి స్పందన రాబట్టుకుందనేది ఆసక్తికరంగా మారింది.
శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించారు. టైగర్ తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది. ఈ మూవీ నుంచి నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతుండగా.. మరోవైపు హమ్మ హమ్మ (Humma Humma) సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
Humma Humma సాంగ్ మేకింగ్ స్టిల్స్ వైరల్..
Vibing with the tribe 💯
Here are a few making stills of #HummaHumma 📸#OoruPeruBhairavaKona 2nd single🎵
– https://t.co/JsSynr4s2E@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana #ShekarChandra @AnilSunkara1 @RajeshDanda_ pic.twitter.com/FEMSnbYaK7— Hasya Movies (@HasyaMovies) November 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

