గల్లీ రౌడీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. సందీప్ కిషన్ మ్యాగ్జిమమ్ ట్రై చేశాడు కానీ..

సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తూ.. నిర్మించిన సినిమా గల్లీ రౌడీ. బాబీ సింహా లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ కూడా ఇందులో ఉన్నాడు. సెప్టెంబర్ 17 న విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. జి నాగేశ్వరరెడ్డి తన స్టైల్లో కామెడీ బాగానే పండించినా కూడా కంటెంట్ వీక్ గా ఉండటంతో సినిమా కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. దాంతో మరోసారి సందీప్ కిషన్ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 12 ఏళ్లుగా ఉన్నాడు సందీప్ కిషన్. ఇన్నేళ్లలో 25 సినిమాలు చేశాడు. మధ్యలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి హిట్ కూడా అందుకున్నాడు. అయితే ఈ హీరోకు ఇప్పటి వరకు కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. చేయాల్సిన ప్రయోగాలు చాలానే చేశాడు సందీప్. కానీ ఏం చేస్తాం టైమ్ బ్యాడ్.. అందుకే బ్లాక్‌బస్టర్స్ లేవు. తాజాగా గల్లీ రౌడీ సినిమాతో వచ్చినా.. అది కూడా నిరాశ పరిచింది. మరి ఈ సినిమాకు వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..

నైజాం: 0.50 కోట్లు
సీడెడ్: 0.32 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.25 కోట్లు
ఈస్ట్: 0.18 కోట్లు
వెస్ట్: 0.12 కోట్లు
గుంటూరు: 0.19 కోట్లు
కృష్ణా: 0.13 కోట్లు
నెల్లూరు: 0.09 కోట్లు
ఏపీ + తెలంగాణ: 1.78 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.12 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 1.90 కోట్లు
గల్లీ రౌడీ సినిమాకు రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ వచ్చిన వసూళ్లు మాత్రం 1.90 కోట్లు మాత్రమే. అంటే మరో కోటి రూపాయలకు పైగానే తీసుకొస్తే తప్ప గల్లీ రౌడీ సేఫ్ అనిపించుకోడు. అయితే లవ్ స్టోరీ విడుదల కావడంతో గల్లీ రౌడీ ఫుల్ రన్ దాదాపు అయిపోయినట్లే. దాంతో సందీప్ కిషన్ మరోసారి ఫ్లాప్ ఖాతాలో వేసుకోక తప్పలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
సాయిపల్లవిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా..
వేణు మాధవ్ రెండో వర్ధంతి.. నల్ల బాలును మరోసారి గుర్తు చేసుకుందామా..!
Samantha Akkineni | సమంత లవ్‌స్టోరి సినిమా చూడదట!
అనుష్క పెళ్లి విషయంలో జ్యోతిష్కుడు కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

