Sundeep Kishan-Regina Cassandra | ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం సహజమే. మరీ ముఖ్యంగా రెండు మూడు సినిమాల్లో ఇద్దరు కలిసి నటిస్తే ఆ రూమర్స్ మితిమీరిపోతుంటాయి. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తుంటాయి. అయితే వీటిపై కొందరూ సెలబ్రెటీలు స్పందిస్తే.. మరికొందరు ఇండిస్ట్రీలో ఇలాంటి రూమర్స్ సహజమే అంటూ సైలెంట్‌గా ఉండిపోతారు. అయితే దాదాపు పదేళ్ల నుండి టాలీవుడ్లో ఓ జంట రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మేము స్నేహితులంరా బాబోయ్ అంటూ ఆ హీరో హీరోయిన్ ఎంత మొత్తుకున్నా వాళ్ళపై గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.
ఆ జంట ఎవరో కాదు రెజీనా-సందీప్ కిషన్. ఇండస్ట్రీలో వీళ్లపై వచ్చినన్ని గాసిప్స్ ఎవరిపై రాలేవేమో. ఇప్పటికీ వీళ్లపై పెళ్లి రూమర్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా సందీప్ వీటిపై స్పందించాడు. ‘మేమిద్ధరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. తను నా బెస్ట్ ఫ్రెండ్. పన్నెండేళ్లుగా ఒకరికొకరం తెలుసు. మేం ఫ్రెండ్స్ మాత్రమే. తను బాంబే వస్తే.. మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుంది. మేము ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రస్ట్ ఉండదు. మా మధ్య ఏదో ఉందంటే సర్ప్రైజ్ అవుతారు’ అంటూ మరోసారి తాము ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. మరి ఇకనైనా వీళ్లపై గాసిప్స్ తగ్గుతాయో లేదో చూడాలి.
సందీప్ కిషన్ తాజాగా మైఖేల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే పోటీగా పెద్ద సినిమాలేవి లేకపోవడంతో కాస్త బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కీలకపాత్రల్లో నటించారు.