Romanchakam | ప్రేమ, హాస్యం కలబోతగా సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్రైలర్!
Romanchakam | టాలీవుడ్ అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సమర్పణలో, 'మేమ్ ఫేమస్' చిత్రం ద్వారా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా నటిస్తున్న తాజా సినిమా "రోమాంచకం" (Romanchakam).
Romanchakam | టాలీవుడ్ అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సమర్పణలో, ‘మేమ్ ఫేమస్’ చిత్రం ద్వారా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా నటిస్తున్న తాజా సినిమా “రోమాంచకం” (Romanchakam). భద్రకాళి పిక్చర్స్ మరియు ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ ప్రభాస్ సరసన అనంతిక సానిల్కుమార్ (Ananthika Sanilkumar) కథానాయకిగా నటిస్తుండగా, వాసుకి వైభవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుండగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
కేవలం సాధారణ ప్రేమకథా చిత్రంగా కాకుండా, నేటి ఆధునిక కాలంలోని డేటింగ్ యాప్స్, రిలేషన్షిప్స్ మరియు ఊహించని మలుపులతో కూడిన యూూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ట్రైలర్లో సుమంత్ ప్రభాస్ తనదైన తెలంగాణ నేటివిటీ యాసతో పాటు, తన మార్క్ కామెడీ అండ్ ఎనర్జిటిక్ నటనతో మరోసారి యువతను ఆకట్టుకునేలా కనిపించారు. మొదట ఎంతో సరదాగా, క్యూట్‌గా సాగే ఈ లవ్ స్టోరీ ఆ తర్వాత ఇంటెన్స్ ఎమోషన్స్, ఊహించని గొడవలు మరియు ఉత్కంఠభరితమైన మలుపులతో ఎలా సాగిందనే అంశాలను ట్రైలర్లో ఎంతో ఆసక్తికరంగా చూపించారు. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి ప్రెజెంట్‌గా వ్యవహరిస్తుండటంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

