Sumanth | ప్రేమకథ, యువకుడు, సత్యం సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ సుమంత్ (Sumanth). ఈ టాలెంటెడ్ యాక్టర్ చివరగా మళ్లీ మొదలైంది (Malli Modalaindi) సినిమాలో లీడ్ రోల్లో నటించాడు. ఆ తర్వాత సీతారామం, సార్ చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిశాడు. ప్రస్తుతం అనగనగా ఓ రౌడీ, వారాహి చిత్రాలతో బిజీగా ఉన్న సుమంత్ కొత్త సినిమా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఇంకా టైటిల్ ఖరారు కానీ సుమంత్ కొత్త చిత్రం జూన్ 19 నుంచి షురూ కానుంది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాశీలో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానున్నట్టు మేకర్స్ తెలియజేశారు. టెంపుల్ బ్యాక్ డ్రాప్లో ఉన్న లుక్‌తో ఈ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీలో మీనాక్షి గోస్వామి, వెన్నెల కిశోర్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలపై స్పష్టత ఇవ్వనుంది సుమంత్ టీం.
Sumanth1