Suma Kanakala | టాలీవుడ్ మోస్ట్ పాపులర్ యాంకర్స్‌లో సుమ కనకాల ఒకరు. ఎలాంటి పెద్ద ఈవెంట్ అయిన సరే సింగిల్ హ్యాండ్‌తో నడిపిస్తుంది సుమ. సందర్భానుసారం సెటైర్లు వేస్తూ, నవ్విస్తూ ఈవెంట్‌ని రక్తి కట్టిస్తుంది. సుమ యాంకరింగ్ చేస్తే ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వరు అనే అభిప్రాయం ఉంది. ఒక్కొక్కరు యాంకరింగ్‌కి గుడ్ బై చెప్పుకుంటూ వెళుతున్న సుమ మాత్రం కొన్ని దశాబ్ధాలుగా సత్తా చాటుతూనే ఉంది. ఎంత మంది వచ్చిన సుమని బీట్ చేయలేకపోతున్నారు. గతంలో సుమ కొన్ని చిత్రాల్లో నటించింది కానీ అవి గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రలు కావు. రెండేళ్ల క్రితం జయమ్మ పంచాయతీ అంటూ తానే ప్రధాన పాత్రలో నటించింది. జయమ్మ పంచాయతీ తర్వాత సుమ మరో చిత్రానికి సైన్ చేయలేదు.
అయితే రీసెంట్గా సుమ ఒక క్రేజీ చిత్రానికి సంతకం చేసినట్టు తెలుస్తుంది. ఓ కీలక పాత్రలో సుమ కనిపించి అలరించనుదట. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సుమ అప్పుడప్పుడు వెరైటీ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. సుమ కనకాల మహానటిగా మారిపోయింది..సేమ్ టు సేమ్ లుక్ లో ఫొటో షూట్ షేర్ చేసింది. వాటికి దారి అందంగా ఉంటే వెళ్లిపోవాలి అది ఎక్కడికి దారి తీస్తుందో అడగకూడదంటూ కోట్ పెట్టింది. అయితే సుమని ఇలా చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. అచ్చం మహానటి మాదిరిగానే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
కేరళలో పుట్టి పెరిగిన తెలుగింటి కోడలిగా అందరికీ దగ్గరైంది ఈ మలయాళి బ్యూటీ. స్పాంటేనియస్ హ్యూమర్‌తో ఏ షో అయినా నడిపించగలిగే సత్తా సుమకే సొంతం. టీవీ రంగంలో ఆమె ఓ మెగాస్టార్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సుమ పవిత్ర ప్రేమ, వర్షం, ఢీ, బాద్షా వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించి మెప్పించారు సుమ. 47 ఏళ్ల వయసులో కూడా సుమ యాంకరింగ్ చేస్తూ కుర్ర యాంకర్లకు పోటీగా నిలుస్తుండడం విశేషం. యాంకర్ సుమకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.