Sulthana Lyrical video Song | గూస్ బంప్స్ తెప్పిస్తోన్న కేజీఎఫ్ 2 ‘ధీరా సుర సుల్తానా’ సాంగ్
పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో వస్తున్న కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2) నుంచి ఇప్పటికే ఎదగరా ఎదగరా అంటూ తల్లీ కొడుకుల సెంటిమెంట్ సాంగ్ విడుదలవగా..అద్బుతమైన స్పందన వస్తోంది. కాగా మేకర్స్ అదిరిపోయే రెండోపాటను విడుదల చేశారు.
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఎదగరా ఎదగరా అంటూ తల్లీ కొడుకుల సెంటిమెంట్ సాంగ్ విడుదలవగా..అద్బుతమైన స్పందన వస్తోంది. కాగా మేకర్స్ అదిరిపోయే రెండోపాటను విడుదల చేశారు.
రణ రణ రణధీరా అనే సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ‘ రణ రణ రణధీరా..గొడుగెత్తె నీల గగనాలు..రణ రణ రణధీరా పదమొత్తె వేల భువనాలు..రణ రణ రణధీరా తలవంచె నీకు శిఖరాలు..రణ రణ రణధీరా జేజేలు పలికే ఖనిజాలు’ అంటూ మాస్ మ్యూజిక్‌తో సంగీత ప్రియులకు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతున్న ఈ పాటను సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాశారు. రవి బస్రూర్ అందించిన మ్యూజిక్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ ప్రాజెక్టులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. రవీనాటాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాతృక భాష కన్నడతోపాటు హిందీ, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Also : Godse Release date | థియేటర్లలోకి ‘గాడ్సే’ వచ్చే టైం ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

