కేజీఎఫ్ సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కన్నడ హీరో యశ్ (Yash). ఈ సినిమా యశ్‌కు కోట్లాది సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF: Chapter 2)హీరో యశ్ అండ్ టీం హైదరాబాద్‌లో ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొంది. ఈ సందర్భంగా యశ్ తనకు పలువురు తెలుగు సెలబ్రిటీల (Telugu celebrities) తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
ప్రధానంగా ఆర్ఆర్ఆర్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ తో ఉన్న రిలేషన్షిప్ గురించి అందరితో పంచుకున్నాడు. ‘షూటింగ్ సంబంధిత ట్రిప్స్ లో భాగంగా నేనెప్పుడైనా హైదరాబాద్‌కు వస్తే, రాంచరణ్ నాకు హోంఫుడ్ పంపిస్తాడని యశ్ చెప్పాడు. ఇక తాను ఎన్టీఆర్ ఇంటిని పలుసార్లు సందర్శించానని అన్నాడు. ఇక ఎన్టీఆర్ (Jr NTR mother) తనను డిన్నర్‌కు రావాలని వ్యక్తిగతంగా ఆహ్వానం పంపాడని చెప్పాడు. వారి కుటుంబంలో ప్రత్యేకించి తారక్ అమ్మ నాకు గొప్పగా ట్రీట్ చేస్తానని’ అన్నాడు యశ్.
Read Also : Prashanth Neel | మందు తాగడం గురించి ఓపెన్ అయిన కేజీఎఫ్ డైరెక్టర్..!
‘ఎన్టీఆర్ కుటుంబం అందించే అతిథ్యాన్ని నా జీవితంలో మరిచిపోలేను. తారక్ అమ్మ గొప్ప మనసున్న వ్యక్తి. నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఆమె కర్ణాటకకు చెందిన వ్యక్తి అవడం వల్లేనేమో మా ఇద్దరి మద్య అనుబంధం చాలా బలంగా ఉండటమే..నాతో బాగా కమ్యూనికేట్ అవుతుంటారని’ చెప్పుకొచ్చాడు యశ్.
Read Also : Jr NTR Deeksha | రాంచరణ్ బాటలో ఎన్టీఆర్..దీక్షకు ప్లాన్..!