రామ్ చరణ్‌కు ఆ సీన్ చెప్పాలంటే భయమేసింది: సుకుమార్

లెక్కల మాస్టారు సుకుమార్ తన పంథా మార్చి ఇటీవల కాస్త విభిన్న కథా చిత్రాలు చేస్తున్నాడు. రామ్ చరణ్‌తో రంగస్థలం వంటి వైవిధ్యకథా చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ ఈ చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులు బద్దులు కొట్టాడు. చిత్రంలో రామ్ చరణ్ .. చిట్టిబాబు పాత్రలో తన నట విశ్వరూపం కనబరిచాడు. రంగస్థలం చిత్రంలో తాను చిరంజీవి వారసుడిని మాత్రమే కాదు ఆయన నటనకు కూడా వారసుణ్ణి అని నిరూపించుకున్నాడు.
రంగస్థలం సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయట పెట్టాడు సుకుమార్. రామ్ చరణ్‌కు సినిమా స్క్రిప్ట్ చెప్పగానే వెంటనే ఓకే చెప్పేశాడు. అయితే అందులోని ఓ సన్నివేశం గురించి చెప్పడానికి చాలా భయపడ్డాను. స్క్రిప్ట్ ప్రకారం ఆసుపత్రిలో ఉన్న ప్రకాశ్ రాజ్‌కు రామ్ చరణ్ అన్ని సపర్యయలు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే హాస్పిటల్లో ఆయన గడ్డం గీయడం, దుస్తులు మార్చడంతో పాటు టాయిలెట్ బ్యాగ్ కూడా తీయాలి. ఈ సీన్ గురించి చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను. భయపడుతూనే ఆ సన్నివేశం గురించి చరణ్‌కి చెప్పాను. ఆయన దానికి పాజిటివ్‌గా స్పందించి చేసేద్దాం అని అన్నారు. ఒక హీరోకు కాదు ఒక నటుడికి ఉండాల్సిన లక్షణం అది అని సుకుమార్ ప్రశంసించాడు.
ఇవికూడా చదవండి..
500 మంది వైద్యులకు ఉచిత భోజనం
టీకా వేసుకున్నా కరోనా వైరస్
విదేశీ సాయంపై పారదర్శకత ఏది?
కొవిడ్ చికిత్సకు యాంటీబాడీ కాక్టైల్
దవాఖానల్లో ఫైర్ సేఫ్టీపై సమీక్షించండి
తండ్రి చితిమంటల్లో దూకిన కూతురు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

