Jolly Bastian | ప్రముఖ స్టంట్ మాస్టర్ కన్నుమూత
దాదాపు 900కుపైగా దక్షిణాది సినిమాలకు పనిచేసిన ప్రముఖ కన్నడ స్టంట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (Jolly Bastian) గుండెపోటుతో బెంగళూర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
బెంగళూర్ : దాదాపు 900కుపైగా దక్షిణాది సినిమాలకు పనిచేసిన ప్రముఖ కన్నడ స్టంట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (Jolly Bastian) గుండెపోటుతో బెంగళూర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కేరళలోని అలెప్పీలో జన్మించిన జాలీ బాస్టియన్ (57) బెంగళూర్‌లో స్ధిరపడ్డారు. యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పేరొందిన జాలీ బాస్టియన్ మరణం సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది.
తన తండ్రి, తాత అడుగుజాడల్లో మెకానిక్‌గా కెరీర్‌ను ప్రారంభించిన జాలీ మాస్టర్ భారీ బైక్‌లపై పెర్ఫామెన్స్‌ను ఆస్వాదించేవారు. రవిచంద్రన్ తొలి సినిమా 1987లో విడుదలైన ప్రేమలోకతో తన 17వ ఏటనే స్టంట్ మన్‌గా జాలీ తన కెరీర్‌ను ప్రారంభించాడు. 2013లో నినగాగి కదిరువెతో ఆయన దర్శకుడిగానూ అరంగేట్రం చేశారు. జాలీ బాస్టియన్ కర్నాటక స్టంట్ డైరెక్టర్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.
24 ఈవెంట్స్ అనే ఆర్కెస్ట్రా గ్రూప్‌ను నడిపిన జాలీ మంచి గాయకుడు కూడా కావడం విశేషం. తన కెరీర్లో పలుమార్లు గాయాలకు గురైన జాలీ ఆపై కోలుకున్న వెంటనే తిరిగి షూటింగ్‌లకు హాజరయ్యేవాడు. జాలీ మరణం పట్ల నటుడు దుల్కర్ సల్మాన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ఐపీ జాలీ మాస్టర్, మీరు ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ ప్రోత్సహిస్తూ దయతో వ్యవహరించేవారని ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా గుర్తుచేసుకున్నారు. దుల్కర్ సల్మాన్, జాలీ మాస్టర్ గతంలో 2014లో బెంగళూర్ డేస్ మూవీకి కలిసి పనిచేశారు.
Read More :
Viral Video | కంటి చికిత్స చేస్తూ వృద్ధురాలిని కొట్టిన డాక్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

