Viral Video | కంటి చికిత్స చేస్తూ వృద్ధురాలిని కొట్టిన డాక్టర్
Viral Video | కంటి చికిత్సకు వెళ్లిన ఓ వృద్ధురాలి పట్ల డాక్టర్ దారుణంగా ప్రవర్తించాడు. వృద్ధురాలికి కంటి చికిత్స చేస్తూ ఆమెను కొట్టాడు. ఈ ఘటన చైనాలోని గైగాంగ్లోని ఓ ఆస్పత్రిలో 2019లో చోటు చేసుకోగా, దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Viral Video | బీజింగ్ : కంటి చికిత్సకు వెళ్లిన ఓ వృద్ధురాలి పట్ల డాక్టర్ దారుణంగా ప్రవర్తించాడు. వృద్ధురాలికి కంటి చికిత్స చేస్తూ ఆమెను కొట్టాడు. ఈ ఘటన చైనాలోని గైగాంగ్లోని ఓ ఆస్పత్రిలో 2019లో చోటు చేసుకోగా, దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. వుహాన్‌లోని ఓ హాస్పిటల్‌కు కంటి చికిత్స కోసమని 82 ఏండ్ల వృద్ధురాలు వెళ్లింది. అయితే ఆమెకు చికిత్స ప్రారంభించే ముందు.. అనస్థషీయా ఇచ్చారు. కానీ ఆమెపై ఆ అనస్థషీయా అంతగా ప్రభావం చూపలేదు. సర్జరీ కొనసాగుతుండగా ఆమె తల, కనుగుడ్లు కదిలించింది. దీంతో కోపంతో ఊగిపోయిన డాక్టర్.. ఆమె తలపై బలంగా కొట్టాడు. చికిత్సకు సహకరించాలని గట్టిగా అరిచాడు.
డాక్టర్ మహిళపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఆ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పింది. ఆమెకు పరిహారం కింద రూ. 5,800 చెల్లించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. వృద్ధురాలిపై దాడి చేసిన డాక్టర్‌ను సస్పెండ్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

